Monday, 16 November 2020

వేమన పద్యం 2 (raamudokaduputti ravikulameederche)

రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియిoచి కులము జెరెచె
ఇలను బుణ్యపాప మీలాగు కాదొక
విశ్వదాభిరామ వినురవేమ
! - వేమన

భావం :-  రఘువంశంలో శ్రీరామచంద్రుడు పుట్టి తన వంశానికి ఎంతో ఖ్యాతిని తెచ్చాడు. కురువంశంలో దుర్యోధనుడు పుట్టి తన వంశాన్నే నాశనం చేశాడు.ఈ భూమి మీద పాప పుణ్యములు ఇలాగే ఉండునని వీరు ఇద్దరు నిరూపించారు.

No comments:

Post a Comment