Sunday, 15 November 2020

సుమతి పద్యం - 118 (kaamukudu danisi vidichina)

కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుఁడు గవయఁ గోరుటయెల్లన్
బ్రేమమున జెఱకు పిప్పికిఁ
జీమలు వెస మూగినట్లు సిద్దము సుమతీ!
  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా!  ఒక విటుడు తృప్తిపడేట్లు భోగించి విడిచన వ్యభిచారిని మరొకడు అనుభవించాలని కోరడం, చెరకు గడ నుండి తియ్యని రసమంతా తీసేసిన తరువాత మిగిలిన చెరకు పిప్పి వద్దకు తమ ఆహారాన్ని వెదుకుతూ చీమలు వెళ్ళినట్లు వుంటుంది .

No comments:

Post a Comment