Friday, 6 November 2020

సుమతి పద్యం - 111 (laavu galavaani kantenu)

లావు గలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివా డెక్కినట్లు మహిలో సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఏ విధంగా అయితే కొండత పెద్దది ఐన ఏనుగును మావటి వాడు నియంత్రించగలడో అదే విధంగా శారీరక బలం ఉన్నవాడికంటే నిజాయితీ పరుడే బలవంతుడు.  

No comments:

Post a Comment