ఆఁకొన్న కూడె యమృతము,
తాఁకొంకిక నిచ్చువాఁడె దాత దరిత్రిన్,
సో కోర్చువాఁడె మనుజుఁడు,
తేఁకువగలవాడె వంశ తిలకుఁడు సుమతీ! - బద్దెన
భావం:- ఓ బుద్ధిమంతుడా! ఆకలితో ఉన్నప్పుడు తిన్న భోజనం అమృతమంత రుచిగా ఉంటుంది. ముందు వెనక ఆలోచించకుండా దానం చేసేవాడే ఈ భూమిపై గొప్ప దాత. అన్ని కష్ట నష్టాలకోర్చి గౌరవాన్ని నిలబెట్టుకోగలిగేవాడే నిజమైన మనిషి.
No comments:
Post a Comment