Thursday, 5 November 2020

సుమతి పద్యం - 107 (siri daa vachina vachunu)

సిరి దా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా!  కొబ్బరికాయలోని నీరు లాగానే సంపద కూడా వస్తుంది. ఏనుగు తిన్న వెలగపండులో ఏ విధంగా గుజ్జుమాయమై కాయ డొల్ల మాత్రమే ఉంటుందో  అదే విధంగా సంపద మన నుండి పోతుంది. 

No comments:

Post a Comment