Monday, 2 November 2020

సుమతి పద్యం - 104 (vesarapu jaati gaani)

వేసరపు జాతి గాని
వీసము దా జేయనట్టి వ్యర్థుడు గానీ
దాసికొడుకైన గానీ
కాసులు గలవాడే రాజు గదరా సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! ఒక వ్యక్తి తక్కువ జాతికి చెందినవాడు కావచ్చు, చాలా తక్కువ సామర్థ్యం ఉన్నవాడు కావచ్చు, ఒక బానిస కొడుకు కావచ్చు, కానీ అతని వద్ద చాలా ధనం ఉంటె అతను రాజు కాగలడు. 

No comments:

Post a Comment