అక్కరకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుగదరా సుమతీ -బద్దెన
భావం:- ఓ మంచి బుద్ధి కలవాడా! అవసరంలో ఉన్నప్పుడు నీకు సహకరించని బంధువుని , ఎంత మొక్కినా వరమివ్వని దేవుణ్ణి , యుద్ధ సమయంలో పరుగెత్తకుండా నీకు సహకరించని గుర్రాన్ని వెంటనే వదిలేయాలి .
No comments:
Post a Comment