Monday, 21 November 2016

వేమన పద్యం 1 (aathma shuddhi leni yachaaramadiyela)

ఆత్మశుద్ధిలేని  యాచార మదియేల 
భాండ శుద్ధి లేని పాకమేల ?
చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా !
విశ్వదాభిరామ  వినురవేమ! - వేమన

భావం :-  మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధి తో చేసే ఆచారం ఎందుకు ? అశుభ్రమైన పాత్రలో వండిన వంట ఎందుకు ? మనసు లగ్నం  చేయకుండా చేసే శివ పూజ ఎందుకు ?

Sunday, 20 November 2016

భర్తృహరి పద్యం 1 (aarambhimparu neecha maanavulu)

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞాని
ధుల్ గావునన్ - ఏనుగు లక్ష్మణ కవి. 


భావం :-  ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడక చివరివరకు  లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి లక్షణం . అలాంటివారు ఉత్తములు.మనం ఎప్పుడు  కార్యసాధకుల వలనే ఉండాలి